![]() |
![]() |

అనసూయ రోజురోజుకూ గ్లామరస్ గా తయారవుతూ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఇప్పుడు రెడ్ కలర్ శారీలో హాట్ మిర్చీగా కనిపించి సందడి చేస్తోంది. అనసూయ అందరి లాంటి యాంకర్ కాదు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ తేల్చేసుకుంటుంది. సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తుంది. చేసినన్నాళ్లు అనసూయ బుల్లితెర మీద చేసి అక్కడ రెస్పెక్ట్ లేకపోవడాన్ని భరించలేక ఆ షోస్ అన్నీ వదిలిపెట్టేసి బిగ్ స్క్రీన్ మీదకు వెళ్ళిపోయింది. నటిగా బిజీ అయిన అనసూయ ఫుల్ టైం సినిమాలకే కేటాయిస్తుంది. కెరీర్లో ఎవరైనా ఎలా బెటర్మెంట్ కావాలని ఆశ పడతారో అనసూయ కూడా అలాగే ఆలోచించింది. చేతి నిండా సినిమాలు రెడీగా పెట్టుకుంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంటరెస్టింగ్ కోట్ తో అందరినీ ఆలోచింపచేస్తోంది. " జీవితంలో ఎదగాలి అంటే డబ్బు, హోదానే కాదు ... నీవు ఆలోచించే విధానం, పరిస్థితులను అర్థం చేసుకునే తీరు ఉంటే అదే నిజమైన అభివృద్ధి" అనే అర్ధం వచ్చేలా ఒక కోట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో అనసూయకు వరుసగా షాప్ ఓపెనింగ్స్ వంటి అవకాశాలు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద నటిస్తూ వెబ్ సిరీస్ మీద కూడా గట్టిగానే కాన్సన్ట్రేట్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ ని అప్ లోడ్ చేస్తూ ఇంకా పాపులారిటీ తెచ్చుకుంటోంది.
![]() |
![]() |